NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / 2036 Olympics: 2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి భారత్‌ అధికారికంగా లేఖ 
    తదుపరి వార్తా కథనం
    2036 Olympics: 2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి భారత్‌ అధికారికంగా లేఖ 
    2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి భారత్‌ అధికారికంగా లేఖ

    2036 Olympics: 2036లో భారతదేశంలో ఒలింపిక్స్..? అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి భారత్‌ అధికారికంగా లేఖ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 05, 2024
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం 2036లో నిర్వహించబోయే ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (IOC)కి అధికారిక లేఖను పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

    ఈ లేఖను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అక్టోబర్ 1వ తేదీన పంపిందని సమాచారం.

    భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రధాని మోదీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

    వివరాలు 

     2028లో లాస్‌ ఏంజిల్స్‌, 2032లో బ్రిస్బేన్‌ 

    "ఒలింపిక్స్‌ నిర్వహణకు భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 2036 ఒలింపిక్స్‌కు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేపడతాం. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గమని ధృవీకరిస్తున్నాం. ఇది 140 కోట్ల భారతీయుల కల. అలాగే, 2029 యూత్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

    అదే సమయంలో, 2028లో లాస్‌ ఏంజిల్స్‌, 2032లో బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌ వేదికలను ఖరారుచేయగా, అందరి దృష్టి 2036 ఒలింపిక్స్‌ వైపు పడింది.

    వివరాలు 

    2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల పోటీలో భారత్‌ 

    "2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం భారత్‌ పోటీలో ఉంది"అని భారత ఒలింపిక్‌ కమిటీ గతంలో ప్రకటించింది.

    2025లో ఐఓసీ అధ్యక్ష ఎన్నికల అనంతరం 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశముంది.

    విస్తృత స్థాయిలో బిడ్డింగ్‌ కాకుండా, ఆసక్తి ఉన్న దేశాల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి, ఐఓసీ నాయకత్వ విభాగం ఈ ఆతిథ్య హక్కులను కట్టబెట్టే అవకాశముంది.

    స్పాన్సర్లు, ప్రసార హక్కులు, ప్రభుత్వ మద్దతు, ప్రజల ఆదరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే, భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించడం ఐఓసీకి లాభదాయకంగా ఉండొచ్చు.

    అందుకే, ఐఓసీ కూడా భారత్‌ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తిగా ఉందని సమాచారం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒలింపిక్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఒలింపిక్స్

    Torch: వేలానికి పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ టార్చ్  క్రీడలు
    Beijing Olympics: బీజింగ్ ఒలింపిక్స్.. 2008 నుంచి భారత్‌ సాధించిన పతకాల రికార్డులు క్రీడలు
    Olympics: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ అత్యుత్తమ ప్రతిభ..నీరజ్ చోప్రా రికార్డ్ నీరజ్ చోప్రా
    Olympics: ఒలింపిక్ బంగారు పతకంలో బంగారం ఎంత ఉంటుంది ..?  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025