Loading...
IWF: భారత్‌లో తొలిసారిగా ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు
భారత్‌లో తొలిసారిగా ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు

IWF: భారత్‌లో తొలిసారిగా ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు

వ్రాసిన వారు Balachander Sharma
Oct 26, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో తొలిసారిగా ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరగనున్నాయి. 2029లో ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ టోర్నీకి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదిక కానుంది. ఇప్పటివరకు ఈ పోటీలను నిర్వహించని భారత్‌కు ఈసారి ఆతిథ్య హక్కులు దక్కడం క్రీడారంగంలో కీలక పరిణామంగా నిలిచింది.

Details

ఐడబ్ల్యూఎఫ్‌ కీలక నిర్ణయం

చైనాలోని నింగ్‌బోలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదే సమావేశంలో 2030 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నిర్వహణ బాధ్యతలను రష్యా రాజధాని మాస్కోకు అప్పగించారు.

2028 ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌షిప్‌ కొసోవోలోని ప్రిష్టినాలో, జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ వెనెజువెలాలోని కారకాస్‌లో జరగనున్నాయి.

Details

గుజరాత్‌కే అవకాశం

గుజరాత్‌కు అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల నిర్వహణలో ఇప్పటికే అనుభవం ఉంది.

ఈ ఏడాది గాంధీనగర్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌ నిర్వహించారు. అలాగే 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ కూడా అహ్మదాబాద్‌లోనే జరగనున్నాయి.

వరుసగా పెద్ద క్రీడా ఈవెంట్లకు వేదికగా నిలుస్తుండటంతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ADVERTISEMENT

Details

ఇదే తొలిసారి

1891లో తొలిసారి నిర్వహించిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకు ఆతిథ్య దేశంగా నిలవలేదు.

మహిళల ప్రపంచ పోటీలు 1987లో ప్రారంభమయ్యాయి. 1991 నుంచి పురుషులు, మహిళలకు కలిపి ఛాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారత వెయిట్‌లిఫ్టర్లు ఇప్పటివరకు 18 పతకాలు సాధించారు.

ఇందులో 3 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి. 1989లో మాంచెస్టర్‌లో జరిగిన పోటీల్లో కుంజరాణి దేవి 44 కేజీల విభాగంలో రజతం గెలిచి భారత్‌కు తొలి పతకం అందించారు.

అదే టోర్నీలో లలితా పొల్లే కాంస్యం సాధించారు. కర్ణం మల్లేశ్వరి 1994, 1995లో వరుసగా ప్రపంచ టైటిళ్లు గెలవగా, మీరాబాయి చాను 2017లో 48 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు.

ADVERTISEMENT