LOADING...
Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్‌ జోరు.. బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధం!
ఆసియా కప్‌లో భారత్‌ జోరు.. బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధం!

Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్‌ జోరు.. బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2025లో భారత జట్టు (Team India) టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్లుగానే జట్టు అదరగొడుతోంది. సూపర్‌-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక టీమ్‌ఇండియా తన రెండో మ్యాచ్‌లో బుధవారం (సెప్టెంబర్‌ 24) దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ సందర్భంలో గత ఆసియా కప్‌ టోర్నీలలో ఈ రెండు జట్లు ఎదురైన ఫలితాలను పరిశీలిస్తే... ఇప్పటి వరకు టీమ్‌ఇండియా అత్యధికంగా ఎనిమిది సార్లు ఆసియా కప్‌ను గెలిచింది. ఏడుసార్లు వన్డే ఫార్మాట్లో, ఒకసారి టీ20 ఫార్మాట్లో టైటిల్‌ ను సొంతం చేసుకుంది.

Details

బంగ్లాపై టీమిండియాదే అధిపత్యం

బంగ్లాదేశ్‌ విషయంలో మూడు సార్లు ఫైనల్‌‌కు చేరుకున్నప్పటికీ, ఒక్కసారి కూడా టైటిల్‌ గెలుచుకోలేకపోయింది. ఆసియా కప్‌లో టీమిండియా, బంగ్లాదేశ్‌ 15 సార్లు ఎదుర్కొన్నప్పుడు 13 మ్యాచుల్లో భారత గెలుపొందింది. కేవలం రెండు మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌ గెలిచింది. 1988, 1990, 1995, 1997, 2000, 2004, 2008, 2010లో భారత జట్టు బంగ్లాదేశ్‌పై గెలిచింది. 2012లో బంగ్లాదేశ్‌ తొలిసారి టీమ్‌ఇండియాపై విజయం సాధించింది. తరువాత 2014, 2016, 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2023లో బంగ్లాదేశ్‌ టీమ్‌ఇండియాపై ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఆసియా కప్‌ ప్రారంభంలో వన్డే ఫార్మాట్లో జరిగింది. 2016లో మొదటిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, ఆ సంవత్సరంలో టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్‌ రెండుసార్లు తలపడ్డాయి

Details

హాట్ ఫేవరేట్ గా బరిలోకి టీమిండియా

రెండింటిలోనూ భారత్ గెలిచింది. 2022లో టీ20 ఫార్మాట్లో అయితే రెండు జట్లు మధ్య పోరు జరగలేదు. ఇప్పుడు 2025లో మళ్లీ టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌లను ఆడింది. రెండింటిలోనూ భారత్ గెలిచింది. గత రికార్డుల ఆధారంగా టీమ్‌ఇండియా ఫేవరెట్‌ అయినప్పటికీ, టీ20లో ఎప్పుడూ ఏం జరిగేదో చెప్పలేము. ఉదాహరణకు, ఈ ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా, ఒమన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఘన పోరు ఇచ్చింది. అందువల్ల బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేయరాదు. అయితే సూపర్‌-4లో టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, మంచి జోష్‌లో ఉంది.