తదుపరి వార్తా కథనం
వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరొక పాయింట్
వ్రాసిన వారు
Stalin
Sep 02, 2023
10:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశ మ్యాచ్ రద్దయ్యింది.
వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ మొదలు కాకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కింది.
దీంతో పాక్ ఇప్పటి వరకు ఈ సిరిస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి మూడు పాయింట్లతో సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించింది.
టీమిండియా ఖాతాలో ప్రస్తుతం ఒక పాయింట్ మాత్రమే ఉంది. ఈ క్రమంలో టీమిండియా సూపర్ ఫోర్ దశకు అర్హత సాధించాలంటే, సెప్టెంబర్ 4న జరిగే నేపాల్‌తో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266/10 పరుగులు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ ట్వీట్
The rain has a final say as the match is Called Off!
— BCCI (@BCCI) September 2, 2023
Scorecard ▶️ https://t.co/hPVV0wT83S
#AsiaCup2023 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/XgEEkjvrC5