LOADING...
IND vs NZ: ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై గెలుపు
ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై గెలుపు

IND vs NZ: ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
10:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ కొనసాగిన ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లూ తీవ్రంగా పోరాడగా, చివరికి విజయం భారత జట్టునే వరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకొని విజయాన్ని అందుకుంది.

Details

రాణించిన విరాట్ కోహ్లీ

భారత బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ 93 పరుగులతో అద్భుతంగా రాణించగా, శుభ్‌మన్‌ గిల్ 56 పరుగులతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 49 పరుగులతో తృటిలో అర్ధశతకం మిస్సయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. హర్షిత్‌ రాణా 29, రోహిత్‌ శర్మ 26 పరుగులు చేసి జట్టుకు కీలక సహకారం అందించారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌ నాలుగు వికెట్లు తీసి ప్రభావం చూపగా, ఆదిత్య అశోక్‌, క్లార్క్‌ చెరో వికెట్‌ సాధించారు. మొత్తంగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో టీమ్‌ఇండియా విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

Advertisement