Page Loader
ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా 
ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా

ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా 

వ్రాసిన వారు Stalin
Mar 10, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4-1 తేడాతో ఓడించిన టీమిండియా మరోసారి ఐసీసీ నంబర్-1 ర్యాంక్ సాధించింది. దీంతో మూడు ఫార్మాట్ల ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి ఆధిపత్యం సాధించింది. ధర్మశాలలో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవడంతో ఆస్ట్రేలియా జట్టు తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ధర్మశాల టెస్టు విజయం తర్వాత టీమిండియా భారత్ 122 రేటింగ్‌ను సాంధించింది. ఆస్ట్రేలియా 117రేటింగ్‌తో రెండు, ఇంగ్లండ్ 111రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా 121రేటింగ్స్‌తో ఉండగా, ఆస్ట్రేలియా కూడా 118రేటింగ్‌లతో రెండో స్థానంలో ఉంది. టీ-20లో భారత్ 266రేటింగ్‌తో ఉండగా, ఇంగ్లండ్(256) రెండో స్థానంలో ఉంది. సెప్టెంబర్ 2023లో భారత్ మొదటిసారిగా మూడు ఫార్మాట్‌ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంగ్లండ్‌పై విజయంతో టెస్టుల్లో టీమిండియా నంబర్ 1