టీ20 సిరీస్‌పై భారత్ కన్ను
పూణేలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. శ్రీలంక 16 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. శ్రీలంక కెప్టన్ షనక 56 పరుగులు చేసి శ్రీలంక విజయంలో భాగస్వామ్యం అయ్యాడు. రాజకోట్ పిచ్‌లో నాలుగు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 179 అత్యధిక పరుగులు. ఛేజింగ్ చేయడానికి వచ్చిన జట్లు రెండుసార్లు గెలిచాయి. స్పిన్నర్ల కన్నా.. పేసర్లకు పిచ్ అనుకూలంగా ఉండనుంది.
రాజ్‌కోట్‌లో రాణిస్తారా
ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1 తో సమానంగా ఉన్నాయి. రెండో టీ20లో కుశాల్ మెండిస్, షనక్ అర్ద సెంచరీలతో మెరిశారు. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్, అక్షర పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ రెండో టీ20లో 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 39 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 267 పరుగులు చేసి 36 వికెట్లు సాధించాడు. భారత్‌పై శ్రీలంక కెప్టెన్ షనక వరసగా 56*, 45, 33*, 74*, 47* పరుగులు చేశాడు. మూడో టీ20లో అయినా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో భారత్ సత్తా చాటి రాణిస్తుందేమో వేచిచూడాలి