Asian Games: రోయింగ్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం
ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో భారత్ ఏడో పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక రోయింగ్ పురుషుల ఫోర్ ఈవెంట్‌లో భారత్ కు కాంస్యం లభించింది. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10:81 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు ఇదే విభాగంలో 6:04:96 సెకన్లతో ఉబ్జెకిస్తాన్ స్వర్ణం గెలుపొందగా, 6:04:96 సెకన్లతో చైనా రజతం సొంతం చేసుకుంది. దీంతో రోయింగ్‌లో భారత్ కు నాలుగు పతకాలు లభించాయి. నిన్న రోయింగ్‌లో రెండు కాంస్యాలు, ఒక రజతం భారత్ సాధించిన విషయం తెలిసిందే.
భారత్ కు ఏడు మెడల్స్
ఇప్పటికే భారత్ ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో మొత్తం 7 మెడల్స్ సాధించి పతకాల పట్టికలో భారత్ ఆరోవ స్థానంలో నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ తొలి స్వర్ణాన్ని సాధించి సత్తా చాటింది. రుద్రాంక్ష పాటిల్, ఐశ్వరీ తోమర్, దిన్యాన్ష్ పన్వర్‌తో కూడిన జట్టు 1893.7 పాయింట్లు నమోదు చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు.