Loading...
Neeraj Chopra: జావెలిన్‌లో భారత్ జోరు.. నీరజ్‌తో పాటు ముగ్గురికి ఫైనల్ బెర్త్ ఖాయం!
జావెలిన్‌లో భారత్ జోరు.. నీరజ్‌తో పాటు ముగ్గురికి ఫైనల్ బెర్త్ ఖాయం!

Neeraj Chopra: జావెలిన్‌లో భారత్ జోరు.. నీరజ్‌తో పాటు ముగ్గురికి ఫైనల్ బెర్త్ ఖాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)తో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో మొత్తం 18 మంది అథ్లెట్లు పోటీపడగా, భారత్ తరఫున బరిలోకి దిగిన ముగ్గురూ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేశారు. నీరజ్ చోప్రా 79.61 మీటర్ల త్రోతో ఫైనల్‌కు చేరగా, రోహిత్ యాదవ్ 78.37 మీటర్లు, యశ్‌వీర్ సింగ్ 78.36 మీటర్లు విసిరి తుది పోరుకు అర్హత సాధించారు. జావెలిన్ త్రో ఫైనల్ శుక్రవారం రాత్రి 10.15 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్వాలిఫయింగ్ రౌండ్‌లో నిర్ణయించిన 84 మీటర్ల డైరెక్ట్ క్వాలిఫికేషన్ మార్క్‌ను ఒక్క అథ్లెట్ కూడా అందుకోలేకపోయాడు.

వివరాలు

తొమ్మిదో స్థానంలో రోహిత్ యాదవ్

గ్లాస్గోలో బలమైన గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

క్వాలిఫయింగ్ రౌండ్‌లో శ్రీలంక అథ్లెట్ రుమేశ్ తరంగ పతిరగె 82.84మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్లతో రెండో స్థానం, దక్షిణాఫ్రికా అథ్లెట్ డౌ స్మిత్ 80.64 మీటర్లతో మూడో స్థానం, బెన్ ఈస్ట్ 80.38 మీటర్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.

భారత స్టార్ నీరజ్ చోప్రా 79.61 మీటర్ల త్రోతో ఐదో స్థానంలో నిలవగా, పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 78.63 మీటర్లతో ఏడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

భారత అథ్లెట్ రోహిత్ యాదవ్ తొమ్మిదో స్థానంలో, యశ్‌వీర్ సింగ్ పదో స్థానంతో, ఇద్దరూ ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.

ADVERTISEMENT