Super 8 Schedule: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8.. భారత్ మ్యాచుల పూర్తి షెడ్యూల్ ఇదే..
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఇప్పుడు సూపర్-8లోకి ప్రవేశించింది. ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఇంగ్లండ్ సూపర్ 8లోకి ప్రవేశించింది. అలాగే బంగ్లాదేశ్ సూపర్-8కి చేరిన 8వ, చివరి జట్టుగా నిలిచింది. నేపాల్‌ను 21 పరుగుల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ సూపర్ 8లోకి ప్రవేశించింది. గ్రూప్-ఎ నుంచి భారత జట్టు, అమెరికా (అమెరికా) అర్హత సాధించాయి. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ప్రవేశించాయి. గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్‌లు చోటు దక్కించుకున్నాయి. కాగా, గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా, ఇప్పుడు బంగ్లాదేశ్‌లు సూపర్-8కి అర్హత సాధించాయి.
జూన్ 20న భారత్ తొలి మ్యాచ్
సూపర్-8లో 4 జట్లతో కూడిన రెండు గ్రూపులు ఉంటాయి.ఈ రెండు గ్రూపుల నుంచి రెండు జట్లు అగ్రస్థానంలో నిలిస్తే సెమీఫైనల్‌లో చోటు దక్కించుకుంటారు. గ్రూప్-1లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్,ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. గ్రూప్-2లో వెస్టిండీస్,అమెరికా,దక్షిణాఫ్రికా,డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌లు చోటు దక్కించుకున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సూపర్-8 దశలో జూన్ 20న బార్బడోస్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనుంది. దీని తర్వాత రెండో మ్యాచ్ జూన్ 22న ఆంటిగ్వాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
సూపర్ 8 గ్రూప్
జూన్ 24న సెయింట్ లూసియాలో భారత జట్టు సూపర్-8లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. సూపర్ 8లో భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రూప్-1: భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-2: అమెరికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా
టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 మ్యాచ్‌ల షెడ్యూల్
జూన్ 19 - USA vs సౌత్ ఆఫ్రికా, ఆంటిగ్వా, 8 pm జూన్ 20 - ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, సెయింట్ లూసియా, ఉదయం 6 గం జూన్ 20 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇండియా, బార్బడోస్, రాత్రి 8 గం జూన్ 21 - ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, ఆంటిగ్వా, ఉదయం 6 గం జూన్ 21 - ఇంగ్లండ్ vs సౌత్ ఆఫ్రికా, సెయింట్ లూసియా, రాత్రి 8 గం జూన్ 22 - USA vs వెస్టిండీస్, బార్బడోస్, ఉదయం 6 గం
టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 మ్యాచ్‌ల షెడ్యూల్
జూన్ 22- భారత్ vs బంగ్లాదేశ్, ఆంటిగ్వా, రాత్రి 8గం జూన్ 23 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, సెయింట్ విన్సెంట్,ఉదయం 6 గం జూన్ 23 - USA vs ఇంగ్లాండ్, బార్బడోస్, 8 pm జూన్ 24 - వెస్టిండీస్ vs సౌతాఫ్రికా, ఆంటిగ్వా,ఉదయం 6 గం జూన్ 24 - ఆస్ట్రేలియా vs ఇండియా, సెయింట్ లూసియా,రాత్రి 8 గం జూన్ 25 - ఆఫ్ఘనిస్తాన్ vs బంగ్లాదేశ్, సెయింట్ విన్సెంట్,ఉదయం 6 గం జూన్ 27 - సెమీఫైనల్ 1, గయానా,ఉదయం 6 గం జూన్ 27 - సెమీఫైనల్ 2, ట్రినిడాడ్,8 pm జూన్ 29 -ఫైనల్, బార్బడోస్, రాత్రి 8 గం