LOADING...
IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్.. టాస్ కోసం ప్రత్యేక నాణెం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్.. టాస్ కోసం ప్రత్యేక నాణెం

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్.. టాస్ కోసం ప్రత్యేక నాణెం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభమవుతోంది. తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో, రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గువాహటిలో జరగనుంది. ఈ ప్రత్యేక సిరీస్‌లో టాస్ కోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ ప్రత్యేక బంగారు నాణెం రూపొందించింది. ఈ గోల్డ్ కాయిన్‌లో ఒక వైపు భారత జాతిపిత మహాత్మాగాంధీ,మరోవైపు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చిత్రాలు ముద్రించారు. శాంతి, స్వేచ్ఛ, అహింస మార్గంలో సాధించిన కృషిని స్మరించేందుకు ఈ ప్రత్యేక నాణెం రూపొందించబడిందని CABఅధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు. ఈ నాణెంను సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో టాస్ సందర్భంగా ఉపయోగిస్తారని ఆయన చెప్పారు.

Details

ఈడెన్ గార్డెన్స్ లో భద్రతా ఏర్పాట్లు

2015 నుండి ఈరుజట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌ను మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా గౌరవార్థం "ఫ్రీడమ్ ట్రోఫీ"గా పిలుస్తున్నారు. ఆరేళ్ల తర్వాత కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్ మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. తొలి మూడు రోజుల టికెట్లు దాదాపుగా అమ్ముడయినట్లు CAB ట్రెజరర్ సంజయ్ దాస్ తెలిపారు. CAB అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రకారం, టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ప్రత్యేకంగా స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను కోరలేదు. కాబట్టి ఈసారి బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరికీ సౌకర్యవంతంగా మ్యాచ్ ఆటగాళ్లకు సమతూక పిచ్ సిద్ధం చేయబడిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు, దిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం భారీ పేలుడు సంభవించడంతో ఈడెన్ గార్డెన్స్‌లో భద్రతా ఏర్పాట్లు కఠినంగా నిర్వహిస్తున్నారు.

Advertisement