LOADING...
India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో
India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో

India vs Australia final: ప్రపంచ కప్ ఫైనల్‌కు బీసీసీఐ భారీ సన్నాహాలు.. ఎయిర్ షో, లైట్ షో ఇంకా ప్రత్యేకతలెన్నో

వ్రాసిన వారు Stalin
Nov 18, 2023
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కప్ 2023 గ్రాండ్ ఫినాలే టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్డేడియం వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఫినాలే సందర్భంగా జరిగే ఈవెంట్ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ ఫైనల్‌ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఎలాంటి ఏర్పాట్లు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ కప్ 2023ఫైనల్ మ్యాచ్‌కు ముందు, భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. ఈ ఎయిర్ షోను భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ నిర్వహిస్తుంది. ఫైనల్‌లో భాగంగా ఇన్నింగ్స్ విరామం సమయంలో, ప్రముఖ గాయకుడు ప్రీతమ్ 500మంది గాయకులు, నృత్యకారుల బృందంతో కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఐసీసీ

చరిత్రలో తొలిసారిగా విజేతగా నిలిచిన కెప్టెన్‌కు సత్కారం

తొలి ఇన్నింగ్స్‌ డ్రింక్ బ్రేక్‌ సమయంలో ప్రముఖ గుజరాతీ గాయకుడు ఆదిత్య గాధ్వి తన ప్రదర్శన ఇవ్వనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ డ్రింక్ బ్రేక్ సమయంలో అంటే రాత్రి 8:30 గంటల సమయంలో లైట్ అండ్ సౌండ్ షో నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌లో వరల్డ్‌కప్‌ గెలిచిన కెప్టెన్‌‌తో పరేడ్‌‌ కూడా ఉంటుంది. తొలిసారిగా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కెప్టెన్‌ను ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ రోజున సత్కరించనున్నారు. విజేత జట్టు హైలెట్స్‌ను స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. ప్రధాని మోదీ హాజరు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోదీ కూడా రానున్నారు. ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్‌లను మోదీ ఆహ్వానించారు.