India vs New Zealand : ఉదయం 7.30 గంటలకే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. లైవ్ ఎక్కడ చూడాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డేకు ఆక్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఆక్లాండ్‌కు చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను గెలుపుతో ప్రారంభించాలని భారత్, న్యూజిలాండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దీంతో మ్యాచ్‌లు ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న ఐదు వన్డే మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్నాయి.
వివరాలు
భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
న్యూజిలాండ్, భారత్ మధ్య సమయ వ్యత్యాసం కారణంగా మన దేశంలో మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలకే మొదలవుతాయి.
క్రికెట్ అభిమానులు ఉదయాన్నే మ్యాచ్‌లను వీక్షించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
తొలి వన్డే: నవంబర్ 4 ఆక్లాండ్
రెండో వన్డే: నవంబర్ 7 వెల్లింగ్టన్
మూడో వన్డే: నవంబర్ 10 హామిల్టన్
నాలుగో వన్డే: నవంబర్ 13 మౌంట్ మౌంగనుయి
ఐదో వన్డే: నవంబర్ 15 - మౌంట్ మౌంగనుయి
వివరాలు
లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో వీక్షించడం సాధ్యం కాదు.
ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో టీవీల్లో మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.
ఇక మొబైల్, ల్యాప్‌టాప్‌లలో ఓటీటీ ద్వారా వీక్షించాలనుకునేవారు సోనీ లివ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.