IND vs SA: ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2025 నవంబర్ 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆతిథ్యం ఇచ్చే ఈ మ్యాచ్‌కు ముందే వర్షం కలగలసిన అవకాశాలపై ఫ్యాన్స్‌లో ఆందోళన ఏర్పడింది. అయితే వాతావరణ శాఖ ప్రకారం మ్యాచ్ రోజున వర్షం ముప్పు లేదు. కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉన్నా అది తక్కువగా ఉండవచ్చునని పేర్కొంది. ఉష్ణోగ్రతలు సుమారు 28 డిగ్రీలుగా ఉండవచ్చని వివరించింది. పిచ్ పరిస్థితులు కూడా బ్యాట్స్‌మెన్, బౌలర్స్ రెండింటికి అనుకూలంగా ఉంటాయి. తొలి రోజున పేసర్లకు లాభం ఉండే అవకాశం ఉన్నా, ఆ తర్వాత స్పిన్నర్లకు అవకాశం ఉంటుంది.
Details
హెడ్-టు-హెడ్ రికార్డు
భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 44 టెస్టుల్లో ఒకదానితో ఒకటి ఎదురయ్యాయి. ఇందులో భారత్ 16 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా 18 మ్యాచ్‌లలో విజయం సాధించింది. భారత్ గడ్డపై 19 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా 5, భారత్ 11 మ్యాచ్‌లలో గెలిచింది.
Details
టీమిండియా జట్టు ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్. దక్షిణాఫ్రికా జట్టు ఇదే టెంబా బావుమా (కెప్టెన్), జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, సెనూరన్ ముత్తుసామి కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్బ్స్ (వికెట్ కీపర్).