Page Loader
భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే
శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ .. భారత్ బ్యాటింగ్ బలాలు, బలహీనతలు

భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి ఈ ఏడాదిని టీమిండియా ఘనంగా బోణి కొట్టింది. రేపటి నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ను గౌహతి వేదికగా ఆడనుంది. టీ20 సిరీస్ కు రెస్టు తీసుకున్న సీనియర్ ప్లేయర్లు రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా మరింత పటిష్టంగా తయారైంది. విరాట్ కోహ్లీ తిరిగి భారత్ వన్డే జట్టులోకి ప్రవేశించాడు. ఈసారి అభిమానులు కోహ్లీ నుంచి ఎక్కువ పరుగులను అశిస్తున్నారు. అయితే కోహ్లీ ఎడమచేతి వాటమున్న బౌలర్లను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇప్పటి వరకు 109 వన్డేల్లో 30 సార్లు ఎడమచేతి వాటం పేసర్ల బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దిల్షాన్ మధుశంక కోహ్లీ వికెట్ ను పడగొట్టాలని గట్టి ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్

హార్ధిక్ పాండ్యా వర్సర్ హసరంగా

ముఖ్యంగా హార్ధిక్ పాండ్యా మిడిలార్డర్ లో ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒకానొక దశలో లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగాను హార్ధిక్ ఎదుర్కోవాల్సి వస్తుంది. హసరంగా కీలక వికెట్లు తీస్తూ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడు. హాసరంగ్ బౌలింగ్ లో హార్ధిక్ పాండ్యా రాణిస్తే టీమిండియా అత్యధిక స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. బౌలింగ్ లో పాతుమ్ నిస్సాంక మెరుగ్గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా భారత్ జట్టుపై ప్రభావం చూపాలనే తపనతో ఉన్నాడు. భారత్ తరుపున యార్కర్ల కింగ్ జస్పిత్ బుమ్రా రాణిస్తే టీమిండియాకి తిరుగు ఉండదు. మరో పక్క శ్రీలంక బౌలర్ దనుష్ తన బౌలింగ్ లో వికెట్లు తీయడానికి సిద్ధమయ్యాడు. అయితే మొదటి వన్డేలో ఎవరు రాణిస్తారో వేచి చూడక తప్పదు.