Loading...
IND vs ZIM: భారత్ vs జింబాబ్వే టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఈసారైనా టీమిండియా గెలుస్తుందా?
భారత్ vs జింబాబ్వే టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఈసారైనా టీమిండియా గెలుస్తుందా?

IND vs ZIM: భారత్ vs జింబాబ్వే టీ20 సిరీస్.. పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ ఇవే.. ఈసారైనా టీమిండియా గెలుస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-0తో గెలుచుకున్నప్పటికీ, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఇప్పుడు ఆ నిరాశను మరచి కొత్త సవాల్‌కు సిద్ధమైంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు జింబాబ్వే పర్యటనకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుండగా ఈ సిరీస్‌ను కైవసం చేసుకుని మళ్లీ విజయాల బాట పట్టాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది.

వివరాలు

సిరీస్ షెడ్యూల్

భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జూలై 23న జరగనుంది. రెండో టీ20 జూలై 25న, మూడో మరియు చివరి మ్యాచ్ జూలై 26న నిర్వహించనున్నారు. మూడు మ్యాచ్‌లకూ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక కానుంది.

కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఈ పర్యటనలో భారత జట్టు రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందుబాటులో ఉండరు.

ఆయన స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు.

భారత కెప్టెన్‌గా తన తొలి టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో అయ్యర్ ఈ పర్యటనను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు

వివరాలు

వైభవ్ సూర్యవంశిపై ఫోకస్

గత సిరీస్‌లోలాగే ఈసారి కూడా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశిపై అందరి దృష్టి నిలిచింది.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన వైభవ్‌కు ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

ఇప్పుడు జింబాబ్వేపై మెరుగైన ప్రదర్శన చేసి జట్టులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

మ్యాచ్‌ల సమయం.. ఎక్కడ చూడొచ్చు?

సాధారణంగా భారత జట్టు టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

అయితే జింబాబ్వే పర్యటనలో మూడు మ్యాచ్‌లు కూడా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఈ సిరీస్‌ను 'జీ యునైట్8 స్పోర్ట్స్' నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ఫ్యాన్‌కోడ్ యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.

ఇంగ్లండ్‌తో ఎదురైన చేదు అనుభవాన్ని వెనక్కి నెట్టి, యువ జట్టుతో జింబాబ్వేపై సిరీస్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT