LOADING...
Ind Vs Aus: నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు 
నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు

Ind Vs Aus: నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్ భారత్‌ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 119 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో అతిథ్య జట్టులో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30 పరుగులు) అత్యధిక స్కోర్‌ సాధించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు వికెట్లు తీసి దుమ్మురేపాడు. అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే చెరో రెండు వికెట్లు సాధించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌,జస్ప్రీత్‌ బుమ్రా,వరుణ్‌ చక్రవర్తి చెరో వికెట్‌ తీసి విజయంలో భాగమయ్యారు. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు