
Asia Cup 2025 : సూపర్-4లో పాక్ పై భారత్ గెలుపు.. కానీ జీరో పాయింట్స్.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్-4లో మరోసారి ఎదుర్కోవనున్నాయి. గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించినప్పటికీ సూపర్-4 ప్రారంభమయ్యే సమయంలో భారత్‌కు పాయింట్స్ టేబుల్‌లో జీరో పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం టోర్నమెంట్ ఫార్మాట్‌లో ఉంది. ఆసియా కప్‌లో గ్రూప్ దశలో గెలిచిన పాయింట్లు సూపర్-4కు తీసుకెళ్ళబడవు. సూపర్-4లో పాల్గొనే అన్ని జట్లు - భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక - జీరో పాయింట్స్‌తో ప్రారంభిస్తాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ల ఫలితాలు సూపర్-4 పాయింట్స్ టేబుల్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. 2003, 2007 ప్రపంచ కప్‌ల రౌండ్ రాబిన్ ఫార్మాట్ (సూపర్-8) నుండి భిన్నంగా ఆసియా కప్‌లో జట్ల పాయింట్లు ముందుకు తీసుకెళ్లబడవు.
Details
బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచులో ఓటమి
ప్రపంచ కప్‌లో ఒకే గ్రూప్‌లోని జట్లు సూపర్-8లో తిరిగి ఆడవు, కానీ ఆసియా కప్‌లో గ్రూప్ దశలో ఒకరినొకరు ఎదుర్కొన్న జట్లు సూపర్-4లో మళ్ళీ కలుస్తాయి. ఈ ఫార్మాట్ 2018 నుంచి అనుసరిస్తున్నారు. ఈ ఫార్మాట్ వల్ల శ్రీలంకకు కొంతనష్టం ఏర్పడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ను ఓడించిన శ్రీలంక, సూపర్-4లో అదే బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఫలితంగా శ్రీలంకకు ఇప్పటికీ జీరో పాయింట్స్ ఉన్నాయి. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే, రాబోయే రెండు మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్, పాకిస్తాన్ రెండూ సూపర్-4లో జీరో పాయింట్స్‌తోనే తమ మ్యాచ్‌లను ప్రారంభించాయి. ఆసియా కప్ ఫైనల్‌కు చేరాలంటే సూపర్-4లో అత్యుత్తమ ప్రదర్శన చేసి, పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2లో నిలవాల్సి ఉంటుంది.