
INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్ మధ్య నిర్వహించిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. సిరీస్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఫైనల్‌లో భారత్ నిర్దేశించిన 343 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక బరిలోకి దిగింది. అయితే లంక జట్టు 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది.
బ్యాటింగ్‌లో చమరి ఆటపట్టు 51 పరుగులతో అర్ధశతకం నమోదు చేయగా, నీలాక్షి 48, విష్మి 36 పరుగులతో కొంత ప్రతిఘటించారు.
అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలింగ్ విభాగంలో స్నేహ్ రాణా 4 వికెట్లు తీయగా, అమన్‌జ్యోత్ కౌర్ 3 వికెట్లు తీశారు. శ్రీచరణి ఒక వికెట్ తీసింది.
Details
సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన
ముందు బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.
స్మృతి మంధాన అద్భుతంగా ఆడి 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేసి సెంచరీ సాధించింది. హర్లీన్ డియోల్ 47, జేమీమా రోడ్రిగ్స్ 44, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 41, ప్రతీకా రావల్ 30 పరుగులతో రాణించారు.
శ్రీలంక బౌలర్లలో దేవ్మీ విహంగా, సుగందికా కుమారి, మదార తలో రెండు వికెట్లు పడగొట్టగా, ఇనోకా రణవీర ఒక వికెట్ తీసింది.
భారత్‌కు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సమిష్టిగా విజయాన్ని అందించిన ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది.