Loading...
India Women Hockey: అదరగొట్టిన అమ్మాయిలు...చైనాపై భారీ విజయం
అదరగొట్టిన అమ్మాయిలు...చైనాపై భారీ విజయం

India Women Hockey: అదరగొట్టిన అమ్మాయిలు...చైనాపై భారీ విజయం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల హాకి జట్టు మరోసారి ఆసియా స్థాయిలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భోపాల్‌లో శనివారం జరిగిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2026 ఫైనల్లో చైనాను 3-1తో ఓడించి రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఒక దశలో 0-1తో వెనుకబడిన భారత్‌.. రెండో అర్ధభాగంలో ఆటను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. దీపిక రెండు గోల్స్‌, ఇషిక ఒక గోల్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో భారత మహిళల హాకీకి 2026 మరో చారిత్రక సంవత్సరంగా నిలిచింది.

Details

వెనుకబడినా.. భారత్‌ తగ్గలేదు

మ్యాచ్‌ ఆరంభంలో చైనా దూకుడుగా ఆడింది. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ దక్కించుకున్నా భారత రక్షణ దానిని అడ్డుకుంది.

అయితే 25వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌ను యుజున్‌ చెన్‌ గోల్‌గా మార్చడంతో చైనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలి అర్ధభాగం ముగిసే వరకు భారత్‌కు సమం చేసే అవకాశం రాలేదు. కానీ విరామం తర్వాత భారత ఆటగాళ్లు మరింత దూకుడుగా మారారు. 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మార్చి స్కోరును 1-1 చేసింది.

Details

నాలుగు నిమిషాల్లో రెండు గోల్స్

స్కోరు సమమైన తర్వాత భారత్‌ వేగం మరింత పెరిగింది. 42వ నిమిషంలో నేహా అందించిన బంతిని ఇషిక అద్భుతంగా ఫీల్డ్‌ గోల్‌గా మలిచింది.

దీంతో భారత్‌ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. సరిగ్గా నిమిషం వ్యవధిలోనే దీపిక మరోసారి మెరిసింది.

43వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి భారత్‌ ఆధిక్యాన్ని 3-1కి పెంచింది.

ఆ తర్వాత చైనాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత రక్షణ గట్టిగా నిలిచింది. చివరి వరకు స్కోరును కాపాడుకున్న భారత్‌ నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

ADVERTISEMENT