LOADING...
LA 2028 Olympics: 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు .. ధృవీకరించిన ఐసీసీ
ధృవీకరించిన ఐసీసీ

LA 2028 Olympics: 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు .. ధృవీకరించిన ఐసీసీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో గ్రూప్‌ దశకే పరిమితమై అభిమానులను నిరాశపరిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఊరటనిచ్చే వార్త అందింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు అధికారికంగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ధ్రువీకరించాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయినా, ఆసియా జట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రదర్శన ఆధారంగా భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో స్థానం ఖాయం చేసుకుంది.

వివరాలు 

1900 ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరం 2028 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో ప్రత్యేక స్థానం ఉండటం విశేషం. 1900 ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ పోటీలు నిర్వహించగా,దాదాపు 128 ఏళ్ల తర్వాత 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌తో ఈ క్రీడ మళ్లీ ఒలింపిక్ వేదికపైకి రానుంది. ఈసారి క్రికెట్ టోర్నీని మొత్తం ఆరు జట్లతో నిర్వహించనున్నారు.

Advertisement