U19: చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. 241 పరుగులకే ఆలౌట్
ఈ వార్తాకథనం ఏంటి
అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు 46 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్‌లో ఆరోన్ జార్జ్ ఆకట్టుకున్నాడు. అతడు 85 పరుగులతో అర్ధశతకం సాధించి జట్టుకు ప్రధాన ఆసరాగా నిలిచాడు. ఓపెనర్ ఆయుష్ 38 పరుగులు చేయగా, కనిష్క్ చౌహాన్ 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అభిగ్యాన్ 22 పరుగులు చేసి స్కోరును ముందుకు నడిపించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశారు.
Details
రాణించిన పాక్ బౌలర్లు
సయ్యమ్, సుభాన్ చెరో మూడు వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నిక్వాబ్ రెండు వికెట్లు పడగొట్టగా, రజా, హుస్సేన్ చెరో ఒక వికెట్ తీశారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లకు ముందే ఆలౌటై, పాకిస్థాన్‌కు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.