NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Karun Nair: టెస్టుల్లో రీఎంట్రీనే నాకు ముఖ్యం: కరుణ్ నాయర్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Karun Nair: టెస్టుల్లో రీఎంట్రీనే నాకు ముఖ్యం: కరుణ్ నాయర్ 
    టెస్టుల్లో రీఎంట్రీనే నాకు ముఖ్యం: కరుణ్ నాయర్

    Karun Nair: టెస్టుల్లో రీఎంట్రీనే నాకు ముఖ్యం: కరుణ్ నాయర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 30, 2025
    02:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయ్ హజారే ట్రోఫీలో శతకాలు బాదుతూ కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

    సుమారు 390సగటుతో 779పరుగులు చేసి తన సత్తా చాటాడు.అంతకుముందు, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

    కానీ, తన స్థానం నిలుపుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ రాణించినప్పటికీ,ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు.

    ఈవిషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే.

    మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ,ప్రస్తుతం అతడి బ్యాటింగ్ స్థానంలో ఖాళీ లేకపోవడం వల్ల ఎంపిక చేయలేకపోయామని తెలిపారు.

    కనీసం బ్యాకప్ ఆటగాడిగా తీసుకుంటే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    అయితే,కరుణ్ నాయర్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ వైపు చూడకుండా టెస్టుక్రికెట్‌లో తిరిగి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

    వివరాలు 

    "నా లక్ష్యం టెస్టు క్రికెట్‌" 

    ''విజయ్ హజారే ట్రోఫీ గానీ,ఇతర టోర్నమెంట్‌లు గానీ, ఎక్కడైనా నా ప్రదర్శన అగ్రస్థాయిలో ఉండాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను.కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఆలోచించే సమయం నాకు లేకపోయింది.ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతాను..ప్రతిఒక్కరికీ తమదైన లక్ష్యాలు ఉంటాయి.మనం ఏదో ఒక లక్ష్యాన్ని పొందాలని కోరుకున్నప్పుడు,దానిపై దృష్టిపెడతాం.కానీ,ఏం జరుగుతుందనేది మనలో కొంత ఆందోళన కలిగించగలదు.నా దృష్టి మాత్రం భారత్ తరఫున మళ్లీ టెస్టు క్రికెట్ ఆడడంపైనే ఉంది.ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల్లో ఇదే చెప్పాను. నా మనసులో ఉండే ఏకైక లక్ష్యం అదే. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నేను ఎంపికవుతానా లేదా అనే అంశంపై నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే, దాని గురించి నాకు నిరాశ ఏమీ లేదు'' అని కరుణ్ నాయర్ వెల్లడించాడు.

    వివరాలు 

    సచిన్ తెందూల్కర్ అభినందనలు 

    ''విజయ్ హజారే ట్రోఫీలో నాకు అద్భుతమైన అనుభవం దక్కింది. నా ప్రదర్శనపై సచిన్ తెందూల్కర్ అభినందనలు అందుకోవడం విశేషం. బాల్యంలో నుంచి నా ఆదర్శంగా భావించే వ్యక్తి నన్ను ప్రశంసించటం గొప్ప అనుభూతి. అది నాకు మరపురాని క్షణం. కానీ, ఈ స్థాయిని కొనసాగించడం కూడా ఎంతో ముఖ్యమైంది. ప్రతి మ్యాచ్, ప్రతి ఇన్నింగ్స్‌ ప్రాముఖ్యమే. ఇకపై నా దృష్టి అదే'' అని కరుణ్ నాయర్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    క్రికెట్

    Syed Mushtaq Ali Trophy: టీ20ల్లో బరోడా రికార్డు స్కోరు.. ఇన్నింగ్స్‌లో 37 సిక్సర్లు.. క్రీడలు
    First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?  క్రీడలు
    Shammi Silva: జై షా స్థానంలో ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా శ్రీలంక
    England: క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్ అరుదైన ఘనత .. 5లక్షల పరుగుల ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025