
Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్ రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ (Priya Saroj) నిశ్చితార్థం ఆదివారం లఖ్‌నవూలో ఘనంగా నిర్వహించారు. సెంట్రమ్ హోటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అదే విధంగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా తదితరులు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Details
నవంబర్ 18న పెళ్లి
రింకు - ప్రియ జంట నవంబరు 18న వారణాసిలో సంప్రదాయబద్ధంగా వివాహ బంధంలో కలవనున్నారు. ఈ పెళ్లికి క్రికెట్, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపనున్నారు. రింకు సింగ్ ఇప్పటివరకు భారత్ తరఫున 2 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 27 ఏళ్ల రింకు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. మరోవైపు, 26 ఏళ్ల ప్రియ సరోజ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచిలీషహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యురాలు. ఆమెకు సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. త్వరలో జరగబోయే ఈ పెళ్లి వేడుక దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించనుంది.