భారత్ జిమ్మాస్ట్ దీపా కర్మాకర్‌పై నిషేధం
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారత స్టార్ జమ్మాస్ట్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల పాటు నిషేధం విధించింది. నిషేధిత పదార్థాన్ని తీసుకున్నందుకు కర్మాకర్‌ను ఇంటర్నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ దోషిగా తేల్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం హిగనమైన్ నిషేధిత లిస్టులో చేర్చారు. ఇంటర్నేషనల్ డీ జిమ్నాస్టిక్ సేకరించిన శ్యాంపిల్ పరీక్షలలో కర్మాకర్ పాజిటివ్ తేలింది. దీంతో 2021 అక్టోబర్ 11వ తేదీన ఆమె వద్ద నుంచి శ్యాంపిల్ సేకరించి గుర్తించారు. అయితే అప్పటి నుంచి ఆమె పాల్గొన్న అన్ని టోర్నీల్లోని ఫలితాలను డిస్‌క్వాలిఫై చేశారు.
అపారటస్ వరల్డ్ కప్‌కు కర్మాకర్ దూరం
నిషేధం కారణంగా కర్మాకర్ అపారటస్ వరల్డ్ కప్ తో పాటు, కనీసం మూడు వరల్డ్ కప్ సిరీస్ లకు కూడా దూరం కానుంది. కర్మాకర్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం గెలుచుకుంది, ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ కాంస్యంతో సత్తా చాటింది. 2015 ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ జిమ్నాస్ట్‌గానూ నిలిచింది.