Page Loader
హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ
క్వార్టర్ ఫైనల్స్‌కు చేరలేకపోయిన ఇండియా

హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2023
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

హాకీ వరల్డ్ కప్ టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా వరల్డ్‌కప్ నుంచి ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్‌లో 3-3 గోల్స్‌తో టై కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఇందులో న్యూజిలాండ్ ఐదు గోల్స్ చేయగా.. ఇండియా నాలుగు గోల్స్ మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ క్వార్టర్ ఫైనల్ కు వెళ్లింది. న్యూజిలాండ్ జనవరి 24న క్వార్టర్-ఫైనల్స్‌లో బెల్జియంతో తలపడుతుంది. మొదటగా లలిత్ కుమార్ గోల్ చేయడంతో ఇండియా 1-0తో టీమిండియా అధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 25వ నిమిషంలో సుఖ్జీత్ గోల్ చేయడంతో 2-0తో నిలిచింది. చివర్లో న్యూజిలాండ్ ప్లేయర్లు దూసుకెళ్లడంతో 3-3తో సమమైంది. పెనాల్టీ షూట్‌లో 4-5తో ఇండియాపై న్యూజిలాండ్ విజయం సాధించింది.

హాకీ

రెండుసార్లు అతిథ్యమిచ్చిన దేశంగా భారత్

భారత్ చివరిసారిగా 1975లో టోర్నమెంట్‌ను గెలుచుకుంది, 1973, 1971లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచింది, 2018 ఎడిషన్‌లో టీమ్ ఇండియా క్వార్టర్-ఫైనల్‌లో నిష్క్రమించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం సాధించడం ద్వారా 41 ఏళ్ల నిరీక్షణకు అప్పట్లో తెరపడింది. 1982 (ముంబై), 2010 (ఢిల్లీ), 2018 (ఒడిశా) తర్వాత భారత్ నాలుగోసారి హాకీ ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది. ఒక దేశం టోర్నీకి అత్యధిక సార్లు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ముఖ్యంగా ఈ టోర్నీకి వరుసగా రెండుసార్లు ఆతిథ్యం ఇచ్చిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది