కెనడా ఓపెన్ టైటిల్ జగజ్జేతగా స్టార్ షట్లర్ లక్ష్య సేన్.. ర్యాంకింగ్స్ లోనూ దూకుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మరో టైటల్ ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో లిషి ఫెంగ్‌పై గెలుపొంది కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో జగజ్జేతగా ఆవిర్భవించాడు. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్ లిషి ఫెంగ్‌పైతో లక్ష్య సేన్ తలపడ్డాడు.
అనంతరం జరిగిన హోరాహోరీ పోరులో చైనాకు చెందిన లిషిపై 21-18, 22-20 తేడాతో గెలుపొందాడు.
ఫలితంగా ఈ ఏడాదిలో మొదటి డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిట్ ను కైవసం చేసుకున్నట్టైంది. వరల్డ్ ర్యాంకింగ్స్ లో భాగంగా ప్రస్తుతం లక్ష్యసేన్ 19వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.
DETAILS
విజేతగా నిలిచినందుకు సంతోషిస్తున్నా : లక్ష్యసేన్
కెనడా టైటిల్ గెలుపుతో లక్ష్యసేన్ 12వ స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం కెనడా ఓపెన్ గెలిచిన జోష్ లో ఉన్న లక్ష్యసేన్ తదుపరి యూఎస్ ఓపెన్ టోర్నీలో మెరవనున్నాడు.
కెనడా ఓపెన్ మహిళ విభాగంలో సెమీస్‌లో భారత స్టార్ షట్లర్ సింధూ ఓటమి చూసింది. లక్ష్య సేన్ మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో సత్తాచాటి టైటిల్ విన్నర్ గా అవతరించాడు.
మరోవైపు మ్యాచ్ గెలిచిన అనంతరం ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని పంచుకున్నాడు ఈ స్టార్ షట్లర్. ఈ మేరకు నిరీక్షణ ముగిసిందని, కొన్నిసార్లు కష్టంతో కూడుకున్న పోరాటాలూ మధురమైన విజయాలకు బాటలు పరుస్తాయన్నారు.
కెనడా ఓపెన్ విజేతగా నిలిచినందుకు సంతోషిస్తున్నట్లు రాసుకొచ్చాడు. కెనడా ఓపెన్ టైటిల్ గెలుపుపై క్రీడాభిమానులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్విట్టర్ ద్వారా సంతోషం పంచుకున్న లక్ష్యసేన్
Sometimes, the hardest battles lead to the sweetest victories. The wait is over, and I am delighted to be crowned the Canada Open winner! Grateful beyond words 🎉🏆 #SenMode #BWFWorldTour#CanadaOpen2023 pic.twitter.com/u8b7YzPX01
— Lakshya Sen (@lakshya_sen) July 10, 2023