India Women Squad : దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్ల ప్రకటన.. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా స్మృతి మంధాన!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. డిసెంబర్‌లో జరగనున్న ఈ ఆల్ ఫార్మాట్ పర్యటన కోసం మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. ఈ పర్యటనలో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మూడు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
వివరాలు
వైస్ కెప్టెన్లుగా దీప్తి, షఫాలీ
టెస్టు, వన్డే జట్లకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20 జట్టులో షఫాలీ వర్మకు ఈ బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు భారత మహిళల జట్టు తాజా మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలోనూ సాధారణ ప్లేయర్‌గా కొనసాగనుంది.
టెస్టు జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), శ్రీ చరణి, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింటమణి కలిత, సయాలీ సత్ఘరే.
వివరాలు
వన్డే జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్)
యాస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింటమణి కలిత, సయాలి సత్ఘరే.
టీ20 జట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్)
అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి, ప్రేమ రావత్, అమంజోత్ కౌర్, క్రాంతి గౌడ్, నందిని శర్మ, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, సయాలి సత్ఘరే.
వివరాలు
డిసెంబర్ 9 నుంచి పర్యటన ప్రారంభం
డిసెంబర్ 9న జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో భారత మహిళల దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గ్కెబెర్హా వేదికగా జరగనుంది.
అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
డిసెంబర్ 9: ఏకైక టెస్టు - గ్కెబెర్హా
డిసెంబర్ 16: తొలి వన్డే - పార్ల్
డిసెంబర్ 19: రెండో వన్డే - కేప్‌టౌన్
డిసెంబర్ 22: మూడో వన్డే - బ్లూమ్‌ఫోంటెయిన్
డిసెంబర్ 26: తొలి టీ20 - బెనోని
డిసెంబర్ 29: రెండో టీ20 - పోట్చెఫ్‌స్ట్రూమ్
డిసెంబర్ 30: మూడో టీ20 -పోట్చెఫ్‌స్ట్రూమ్
భారత మహిళల జట్టు డిసెంబర్ నెలలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది.