Astronomy Olympiad: అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థుల సత్తా.. ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో 5 పతకాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ (IOAA)లో భారత విద్యార్థులు సత్తా చాటారు. వియత్నాంలో సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 5 వరకు జరిగిన 19వ అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. దీంతో పోటీల్లో పాల్గొన్న భారత బృందంలోని ప్రతి విద్యార్థి పతకం సాధించిన ఘనతను దక్కించుకున్నాడు.
వివరాలు
నలుగురికి స్వర్ణాలు..
ఈ ఒలింపియాడ్‌లో హైదరాబాద్‌కు చెందిన ప్రాంజల్ దీక్షిత్, దిల్లీకి చెందిన సుమంత్ గుప్తా, గురుగ్రామ్‌కు చెందిన అక్షత్ శ్రీవాస్తవ, ఫరీదాబాద్‌కు చెందిన అర్వాన్ సెహ్రావత్ స్వర్ణ పతకాలు సాధించారు.
వడోదరకు చెందిన హర్షిల్ అమిత్‌కుమార్ పటేల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఆతిథ్య దేశమైన వియత్నాంతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది.
ఇరాన్, దక్షిణ కొరియా చెరో ఐదు స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి.
వివరాలు
2026లో భారత్‌కు ప్రత్యేక ఘనత..
ఈ ఫలితాలతో అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లలో 2026వ సంవత్సరం భారత్‌కు ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ఏడాది వివిధ దేశాల్లో జరిగిన గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లలో భారత్ నుంచి పాల్గొన్న మొత్తం 24 మంది విద్యార్థులు పతకాలు సాధించారు.
వారిలో 16 మంది స్వర్ణ పతకాలు, ఎనిమిది మంది రజత పతకాలు గెలుచుకున్నారు.
అంటే ఈ ఐదు అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లలో పాల్గొన్న భారత విద్యార్థుల్లో ఒక్కరు కూడా పతకం లేకుండా తిరిగి రాలేదు.
వివరాలు
తొలిసారి ప్రతి విద్యార్థికీ పతకం..
భారత్ 1989లో అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొనడం ప్రారంభించింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న భారత విద్యార్థులందరూ పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
2026లో గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, ఆస్ట్రానమీ విభాగాల్లో భారత విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.