Womens T20 WC 2026: మహిళల T20 ప్రపంచకప్‌కి భారత జట్టు ప్రకటన.. ఎవరు ఉన్నారంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 02, 2026
05:47 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల టీ20 ప్రపంచకప్ ఈసారి ఇంగ్లండ్ వేదికగా జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సమావేశమై జట్టును ఖరారు చేసింది. అనంతరం అధికారికంగా టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌ను వెల్లడించింది.
వివరాలు
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీచరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్.