LOADING...
Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టు ఖరారు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!
ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టు ఖరారు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టు ఖరారు.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెప్టెంబర్‌ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్‌ 2025లో ఎనిమిది జట్లు కప్పుకోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే పలు జట్లు తమ తమ స్క్వాడ్‌లను ప్రకటించగా, తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును అధికారికంగా వెల్లడించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వం వహించనున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

Details

భారత జట్టు ఇదే

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, హర్షిత్‌ రాణా, రింకూ సింగ్‌