IND vs AFG Series Squad :అఫ్గాన్ సిరీస్‌కు భారత జట్లు ప్రకటింపు.. రోహిత్, కోహ్లీకి చోటు.. జడేజా, బుమ్రాకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్లను అధికారికంగా ప్రకటించింది. ఈఎంపికలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సెలెక్టర్లు, సీనియర్ ఆటగాళ్ల విషయంలో ఆసక్తికర మార్పులు చేశారు. ముఖ్యంగా రవీంద్ర జడేజాకు టెస్టు, వన్డే జట్లలో రెండింటిలోనూ చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రాకు కూడా ఈ సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. పని భారం (వర్క్‌లోడ్)దృష్ట్యా బుమ్రాను ఎంపిక చేయలేదని సెలెక్టర్లు వెల్లడించారు. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా శుభమాన్ గిల్‌ను నియమించారు. వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయగా, టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు.
వివరాలు
వన్డే సిరీస్ కోసం భారత జట్టు
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు కల్పించారు. అయితే రోహిత్ శర్మతో పాటు హర్దిక్ పాండ్యా తుది జట్టులో ఆడాలంటే ముందుగా తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, నితిష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష దుబేలకు జట్టులో అవకాశం లభించింది. భారత వన్డే జట్టు గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ, అయ్యర్ (వైస్ కెప్టెన్), రాహుల్, కిషన్, పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, గుర్నూర్ దుబేర్.
వివరాలు
టెస్టు జట్టు ఇదే
టెస్టు జట్టుకు కూడా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్‌లకు అవకాశం లభించింది. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురుల్‌ను కూడా ఎంపిక చేశారు. అలాగే ఫడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ దుబేర్, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, హర్ష్ దూబేలకు టెస్టు జట్టులో చోటు దక్కింది.
వివరాలు
భారత టెస్టు జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దేవ్‌దత్ పాడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ దుబేర్, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).