Asian Games 2026: ఆర్చరీలో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. ఆసియా క్రీడల్లో ఏడో గోల్డ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో చైనా జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత బృందం విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కగా.. దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా భారత జట్టు సమం చేసింది. 53కి చేరిన భారత్ పతకాల సంఖ్య ఈ స్వర్ణంతో ఆసియా క్రీడలు 2026లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 53కు చేరింది. ఇందులో 7 స్వర్ణాలు,21 రజతాలు,25 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ టాప్-10లోకి ప్రవేశించింది.ప్రస్తుతం భారత్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
వివరాలు
రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీపై దృష్టి
అథ్లెటిక్స్ ఈవెంట్లు ముగియడంతో ఇక భారత అభిమానుల దృష్టి రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ ఈవెంట్లపై నెలకొంది.
మరోవైపు భారత మహిళల హాకీ జట్టు ఫైనల్ బెర్త్ కోసం సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో కీలక పోరులో తలపడనుంది.
స్టార్ జూడోకా అస్మితా దేవ్ కూడా బరిలోకి దిగనుంది.
ఇక మహిళల ట్రాప్ విభాగంలో నిన్న స్వర్ణ పతకం సాధించిన నీరూ ధండా.. నేడు మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్‌తో పాటు టీమ్ ఈవెంట్లలోనూ పోటీపడనుంది.
దీంతో భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంపౌండ్ ఆర్చరీలో గోల్డ్
AND ITS A GOLD MEDAL 🔥🔥🔥
— India_AllSports (@India_AllSports) September 30, 2026
ARCHERY: INDIA BEAT CHINA 238-234 TO WIN 🥇 IN COMPOUND WOMEN'S TEAM EVENT
Trio of Jyothi, Prithika & Chikitha won in Gold medal match.
📸 @worldarchery#AichiNagoya2026 #AG2026withIAS pic.twitter.com/EeWzPNlrlT