Anahat singh : అదరగొట్టిన అనాహత్ సింగ్.. ప్రపంచ జూనియర్ స్క్వాష్‌లో భారత్‌కు తొలి స్వర్ణ చరిత్ర
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ స్క్వాష్ స్టార్ అనాహత్ సింగ్ ప్రపంచ వేదికపై అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. శనివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ప్రపంచ 20వ ర్యాంకర్ అనాహత్, ఈజిప్ట్‌కు చెందిన రుకయా సలేమ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
వివరాలు
తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర..
11-3, 11-7, 11-9 స్కోర్లతో వరుసగా మూడు గేమ్‌లను సొంతం చేసుకుని ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టైటిల్‌ను కైవసం చేసుకుంది.
18 ఏళ్ల అనాహత్ గత ఏడాది ఇదే టోర్నీలో సెమీ ఫైనల్ వరకు చేరి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌లో అద్భుత ఆటతీరును కనబరిచి స్వర్ణ పతకాన్ని అందుకుంది.
ఈ విజయంతో ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపింది.