ఎనిమిది వారాలు పాటు రాఫెల్ నాదల్ ఆటకు దూరం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ తప్పుకున్నాడు. అమెరికా ఆటగాడు మెకంజీ మెక్ డోనాల్డ్ రెండోరౌండ్‌లో నాదల్ 4-6, 4-6, 5-7తో పరాజయం పొంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు . 36 సంవత్సరాల వయసులో గాయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నాదల్.. ఫిట్ నెస్ సమస్యలతో వరుసగా ఓడిపోవడం శోచనీయం. గాయం బెడదతో దాదాపు ఎనిమిది వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. నిన్న ఓటమి తర్వాత స్పందించిన నాదల్.. వైద్య పరీక్షలు చేయించుకున్నానని, ఎడమ కాలులో కండరాల నొప్పి కారణంగా 6 నుండి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు నాదల్ తెలియజేశారు.
గాయల బెడదతో నాదల్ ఆటకు దూరం
నాదల్ ఈ టోర్నమెంట్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. తన చివరి తొమ్మిది మ్యాచ్లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందాడు. మిగిలిన ఏడు మ్యాచ్‌లో ఓడిపోయాడు. నాదల్ 2022 ద్వితీయార్ధంలో చాలా వరకు గాయల బెడదతో ఇబ్బంది పడ్డాడు. ఫిటెనెస్ సమస్య కారణంగా అశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. ఎడమకాలికి గాయం తీవ్రం కావడంతో రఫెల్ నాదల్ సరైన ఆటను ఆడలేకపోయానని స్పష్టం చేశారు.