LOADING...
Smriti Mandhana: ప్రపంచకప్ విజయంతో స్మృతి నికర ఆస్తి విలువ  ఎంత ఉంటే..?
ప్రపంచకప్ విజయంతో స్మృతి నికర ఆస్తి విలువ  ఎంత ఉంటే..?

Smriti Mandhana: ప్రపంచకప్ విజయంతో స్మృతి నికర ఆస్తి విలువ  ఎంత ఉంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

2025 వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రక విజయం నమోదు చేయడంలో ఓపెనర్ స్మృతి మంధాన అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నీలో భారత జట్టుకు ఆమెనే టాప్ స్కోరర్‌గా నిలిచి, మొత్తం బ్యాటర్లలో రన్నరప్ స్ధానంలో నిలిచింది. ప్రత్యేకంగా ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆమె చేసిన అసాధారణ ఇన్నింగ్స్ జట్టుకు తొలి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందించింది. ఈ గెలుపుతో రికార్డులు మాత్రమే కాదు, స్మృతి సహా మొత్తం జట్టుపై ప్రశంసల రాళ్లు, బహుమతుల వర్షం కురుస్తోంది. ఈ టైటిల్‌తో భారత జట్టుకు ప్రైజ్ మనీగా రూ. 40 కోట్లు లభించింది. అదనంగా, బీసీసీఐ జట్టుకు రూ. 51 కోట్ల బోనస్ ప్రకటించింది.

వివరాలు 

వివిధ మార్గాల్లో స్మృతి సంపాదన 

ఈ మొత్తాన్ని జట్టులోని క్రీడాకారిణులందరికీ పంచనున్నారు. దీనితోపాటు,ఇప్పటికే అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రికెటర్లలో ఒకరిగా ఉన్న స్మృతి మంధాన ఆదాయం, ఆస్తుల వివరాలు మరోసారి చర్చకు వచ్చాయి. స్మృతికి మ్యాచ్ ఫీజులు, గ్రేడ్ కాంట్రాక్ట్, లీగ్ మ్యాచ్‌లు, బ్రాండ్ ఒప్పందాల ద్వారా భారీ ఆదాయం వస్తుంది. బీసీసీఐ మహిళలకు కూడా పురుషుల్లాగే మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. దాంతో స్మృతికి ఒక్క టెస్ట్ మ్యాచ్‌పై: రూ. 15 లక్షలు వన్డే మ్యాచ్‌పై: రూ. 6 లక్షలు టీ20 మ్యాచ్‌పై: రూ. 3 లక్షలు అందుకుంటోంది. అదనంగా, ఆమె బీసీసీఐ గ్రేడ్ 'A' కాంట్రాక్ట్ కింద ప్రతి సంవత్సరం రూ. 50 లక్షలు జీతం అందుకుంటోంది.

వివరాలు 

బ్రాండ్ ప్రమోషన్లు, ఆస్తులు 

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆమెను రూ. 3.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలిచింది. కేవలం క్రికెట్‌తోనే కాకుండా, స్మృతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది. హ్యుందాయ్, హీరో మోటోకార్ప్, నైక్, రెడ్ బుల్, మాస్టర్‌కార్డ్, గల్ఫ్ ఆయిల్, బాటా పవర్ వంటి ప్రసిద్ధ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఒక్కో బ్రాండ్ ఒప్పందానికి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఆమె తీసుకుంటుందని సమాచారం.

వివరాలు 

ఆస్తుల విషయానికొస్తే.. 

మహారాష్ట్రలోని సాంగ్లీలో స్మృతికి జిమ్, హోమ్ థియేటర్ సౌకర్యాలతో కూడిన లగ్జరీ హౌస్ ఉంది. అలాగే ముంబై, ఢిల్లీ నగరాల్లో కూడా ఆమె స్వంత ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అదనంగా ఆమె 'SM-18 స్పోర్ట్స్ కేఫ్' పేరుతో ఒక ఫుడ్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ఆమె వద్ద సుమారు రూ. 70 లక్షల విలువగల రేంజ్ రోవర్ ఎవోక్ కారు ఉంది. ప్రస్తుతం స్మృతి మంధాన నికర ఆస్తుల విలువ సుమారు రూ. 34 కోట్లు గా అంచనా వేస్తున్నారు. ప్రపంచకప్ విజయం తర్వాత ఆమె బ్రాండ్ వాల్యూ, ఆదాయం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.