Page Loader
AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ మిలస్ విజయం
ఎసి మిలన్‌పై 3-0తో విజయం సాధించిన ఇంటర్ మిలస్

AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ మిలస్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

AC మిలన్‌పై ఇంటర్ మిలస్ విజయం సాధించింది. AC మిలన్‌పై 3-0 తేడాతో ఇంటర్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో సూపర్ కోప్పా ఇటాలియానా ట్రోఫిని ఇంటర్ కైవసం చేసుకుంది. ఇంటర్ గత సీజన్‌లో జువెంటస్‌ను ఓడించి ట్రోఫీని కాపాడుకున్న విషయం తెలిసిందే. ఫెడెరికో డిమార్కో, ఎడిన్ డిజెకో, లౌటరో మార్టినెజ్ సత్తా చాటడంతో ఇంటర్‌కి ట్రోఫీ వరించింది. ఇంటర్ 1989, 2005, 2006, 2008, 2010, 2021, 2022లో వరుసుగా సూపర్ కోప్పా ఇటాలియన్ ట్రోఫిని గెలుచుకొని సంచలన రికార్డును నమోదు చేసింది. మిలన్ ఐదుసార్లు ట్రోఫీని కోల్పోవడం గమనార్హం.

మిలాన్

చెత్త ప్రదర్శనతో వెనుతిరిగిన మిలాన్

ఈ సీజన్‌లో ఇంటర్‌ కి చెందిన ఆటగాడు డిజెకో తన 11వ గోల్‌ని సాధించాడు. ఇప్పటివరకూ 75 మ్యాచ్‌లు ఆడి 28 గోల్స్ సాధించాడు. మార్టినెజ్ కూడా ఈ సీజన్‌లో తన 12వ ఇంటర్ గోల్‌ను సాధించడం గమనార్హం. 2005, 2006 తర్వాత ఇంటర్ వరుసగా రెండు ఎడిషన్‌లలో సూపర్‌కోప్పా ఇటాలియన్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం మిలన్ వరుసగా రెండు సూపర్‌కోప్ప ఇటాలియన్ ట్రోఫీలను కోల్పోయి నిరాశ పరిచింది.