
Harsha Bhogle: భోజనానికి పిలిచి.. బయట వెయిట్ చేయిస్తా.. ఇండిగోపై భోగ్లే విమర్శలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)పై క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
విమానం ఆలస్యానికి సంబంధించి తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.
''ఏదో ఒకరోజు ఇండిగో సిబ్బందిని భోజనానికి ఆహ్వానిస్తాను. భోజనం సిద్ధమై, టేబుల్ సర్దేవరకు వారిని బయట వేచి ఉండమని చెబుతానని భోగ్లే విమర్శించారు.
ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తున్న విమానయాన సంస్థల తీరును వ్యంగ్యంగా ఎత్తిచూపారు.
Details
ఇండిగో వివరణ
భోగ్లే చేసిన వ్యాఖ్యలు ఇండిగో దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించింది. వీల్‌ఛైర్ వినియోగదారులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ఆలస్యం చోటుచేసుకుందని సంస్థ తెలిపింది.
అలాగే ఆలస్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంటూ, భోగ్లే ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
డేవిడ్ వార్నర్ అసహనం
ఇండిగోతో పాటు మరో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అసహనం వ్యక్తంచేశారు.
బెంగళూరు విమానాశ్రయంలో పైలట్లు లేని విమానంలో ప్రయాణికులను ఎక్కించడం వల్ల వార్నర్ అసహనానికి గురయ్యారు.
''పైలట్లు లేని విమానంలో గంటల పాటు వేచిచూశాం. పైలట్లు లేరని తెలిసి కూడా ప్రయాణికులను ఎందుకు ఎక్కించారని ప్రశ్నించారు.
Details
ఎయిరిండియా వివరణ
వాతావరణ సమస్యల కారణంగా విమాన మార్గాల మళ్లింపు, ఆలస్యాలు తప్పనిసరి అయ్యాయని ఎయిరిండియా స్పష్టం చేసింది.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.