IPL 2023: సన్ రైజర్స్ ఇక తగ్గేదేలే.. కెప్టెన్ వచ్చేశాడు
ఈ వార్తాకథనం ఏంటి
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ ఐపీఎల్‌లో లక్నో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్ లో నెగ్గింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది.
అయితే సన్ రైజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌ను ముగించుకున్న సౌతాఫ్రికా ప్లేయర్లు ఐడెన్ మార్ర్కమ్, మార్కో జాన్సెన్ ఇండియాలో అడుగు పెట్టారు.
ఈ ఇద్దరు జట్టులో కలిసినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానంలో ఏప్రిల్ 7 రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య జరగనుంది.
సన్ రైజర్స్
లక్నో, సన్ రైజర్స్ జట్టులోని సభ్యులు
ఈ మైదానంలో పేసర్లు రాణించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో 7.30గంటలకు ప్రసారం కానుంది. లక్నోకు మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన క్వింటన్ డికాక్ మూడో మ్యాచ్‌లో ఆడనున్నాడు.
మొదటి రెండు మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో చెలరేగిన కైల్ మేయర్స్ మూడో స్థానంలో దిగే అవకాశం ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, పూరన్ (WK), బడోని, అవేష్‌ఖాన్, మార్క్‌వుడ్, యష్ ఠాకూర్, బిష్ణోయ్
సన్‌రైజర్స్ జట్టు: అభిషేక్‌శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్క్రామ్ (c), హ్యారీబ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ (wk), మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్