Page Loader
IPL 2023 : శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఇదే! 
గాయంపై స్పష్టత ఇచ్చిన శార్దుల్ ఠాకూర్

IPL 2023 : శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ చేయకపోవడానికి కారణం ఇదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2023
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్ ని జట్టులోకి తీసుకున్నప్పటికీ అతను అసలు బౌలింగ్ చేయలేదు. దీంతో అతడు ఫిట్ గా లేకపోవడం వల్లే బౌలింగ్ చేయడం లేదని సోషల్ మీడియాలో ఫుకార్లు వ్యాపించాయి. ఈ వదంతులకు శార్దుల్ ఠాకూర్ చెక్ పెట్టారు. తనకు ఎటువంటి గాయం కాలేదని, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండడం వల్ల తనకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదని చెప్పారు. ఇప్పటివరకూ కేకేఆర్ 11 మ్యాచ్ లు ఆడి ఐదింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

Details

ప్రపంచ టెస్ట్ చాంఫియన్ ఫైనల్ జట్టులో శార్ధుల్ ఠాకూర్ కి అవకాశం? 

ఈ సీజన్ లో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన శార్దుల్ ఠాకూర్ కేవలం 14.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు, గత సీజన్ 2022లో 48.3 ఓవర్లు, 2021 ఎడిషన్‌లో 60 ఓవర్లు బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. కేకేఆర్ జట్టులో ఆల్ రౌండర్ విభాగంలో అండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ బౌలింగ్ వేయగలరని, ఇంకా కెప్టెన్ నితీష్ రానా రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడని, తాను బౌలింగ్ చెయ్యాలా లేదా అనేది కెప్టెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఠాకూర్ చెప్పారు. భారత జట్టులో పలువురు పేసర్లు గాయపడినందున ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో శార్థుల్ ఠాకూర్ ని ఆడించే అవకాశం ఉంది.