IPL 2023 : గుజరాత్ vs కోల్ కత్తా గెలిచేదెవరు?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నాయి. కోల్ కతా లోని ఈడెన్ గార్డన్స్ లో ఈ మ్యాచ్ రేపు 3:30గంటలకు ప్రారంభం కానుంది.
ఇప్పటికే గుజరాత్ ఏడు మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంది. మరోపక్క కోల్ కత్తా ఎనిమిది మ్యాచ్లో కేవలం మూడింట్లోనే నెగ్గింది. ఇక సొంతమైదానంలో గుజరాత్ ను ఓడించాలని కోల్ కతా గట్టి పట్టుదలతో ఉంది.
ఈ సీజన్ ప్రారంభంలో గుజరాత్ పై రికూసింగ్ ఒకే ఓవర్లో ఐదు సిక్సలు కొట్టి కోల్‌కతాను గెలిపించిన విషయం తెలిసిందే. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత కేకేఆర్, చివరి మ్యాచ్లో ఆర్సీబీని ఓడించింది.
Details
ఇరు జట్లలోని సభ్యులు
గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తోంది. గత మ్యాచ్ లో కేకేఆర్ పై ఓడిన గుజరాత్.. ఈ సారి కేకేఆర్ పై నెగ్గి పంతం నెగ్గించుకోవాలని భావిస్తోంది.
కేకేఆర్: ఎన్ జగదీశన్ (wk), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా (c), రింకుసింగ్, రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (c), విజయ్ శంకర్, మిల్లర్, అభినవ్ మనోహర్, తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: జాషువా లిటిల్ (GT), సుయాష్ శర్మ (KKR)