కేకేఆర్ స్టార్ ప్లేయర్ కి ఊహించని షాక్.. భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్ కతా ఊహించిన షాకిచ్చింది.
ఈ మ్యాచ్ లో కోల్ కతా 21 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లీ(54), లామ్రోర్(34) మినహా మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, రస్సెల్, సూయేష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ మ్యాచ్లో ఎక్కువ పరుగులు సాధించిన కేకేఆర్ ఓపెనర్ జాసన్ రాయ్ కు బిగ్ షాక్ తగిలింది.
Details
జాసన్ రాయ్ కి భారీ జరిమానా
ఐపీఎల్ ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినందుకు రాయ్ కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినందుకు రాయ్ కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు.
జాసన్ రాయ్ మ్యాచ్ ఫీజులో 10శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ అధికారులు ప్రకటించారు.
అతడు ఐపీఎల్ ప్రవర్తనా నియామావళి ఆర్టికల్ 2.2 ను రాయ్ ఉల్లంఘించడంతో ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఈ నియమం ప్రకారం రాయ్ క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే జరిమానా విధిస్తారు. అయితే అతడు ఏం చేశాడనేది ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించకపోవడం గమనార్హం.