IPL 2023: ఆరెంజ్ క్యాప్ లిస్టులో యంగ్ ప్లేయర్ టాప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గుజరాత్ పై రాజస్థాన్ విజయం సాధించడంతో నంబర్ ప్లేస్ ను మరింత పదిలపరుచుకోవడం విశేషం. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లను సొంతం చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐదు మ్యాచ్ లు మూడు విజయాలను సాధించిన లక్నో, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తర్వాతి స్థానంలో నిలిచాయి. రన్ రేట్ పరంగా రెండో స్థానంలో లక్నో, మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో పంజాబ్ నిలిచాయి.
11 వికెట్లతో చాహల్ మొదటి స్థానం
ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేసిన కోల్ కతా యంగ్ ప్లేయర్ వెంకటేష్ అయ్యార్ 234 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. 233 పరుగులతో శిఖర్ ధావన్ రెండో స్థానంలో నిలిచాడు. 228 పరుగులతో శుభ్‌మాన్ గిల్, వార్నర్ తర్వాతి స్థానంలో నిలిచారు. పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నారు. మార్క్ వుడ్(11), రషీద్ ఖాన్ (11వికెట్ల)తో రెండు, మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. నేటి మ్యాచ్‌లో బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.