తన కుమారుడి ప్రదర్శనపై సచిన్ ఏమన్నారంటే!
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎంతోమంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. క్రికెట్లో ఎన్నో మరిచిపోలేని రికార్డులను క్రియేట్ చేశారు. తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ అరంగేట్రాన్ని చూసి సచిన్ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. ముంబై ఇండియన్స్ తరుపున తరుపున ఆదివారం తొలి మ్యాచ్‌లో అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసి కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. తొలి ఓవర్లో ఐదు పరుగులిచ్చిన అర్జున్.. రెండో ఓవర్లో మాత్రం 12 పరుగులను సమర్పించుకున్నాడు. మ్యాచ్ అనంతరం సచిన్ తన కొడుకును ఉద్ధేశించి ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆర్జన్ చాలా కష్టపడ్డాడు
అర్జున్ క్రికెటర్ గా తొలి అడుగు వేశాడని, నీవు ఆటకు గౌరవాన్ని తీసుకొస్తే అదే ఆట నిన్ను తిరిగి ప్రేమిస్తుందని, అయితే ఇక్కడ చేరుకోవడానికి ఆర్జున్ చాలా కష్టపడ్డాడని, ఓ తండ్రిగా.. ఆటను ప్రేమించే వ్యక్తిగా క్రికెట్ పట్ల అంకిత భావంతో ముందుకెళ్లాలని ఆర్జున్ కు సచిన్ టెండూల్కర్ సూచించారు. తాను ఐపీఎల్ లో ముంబై తరుపున అరంగేట్రం చేసి 16 ఏళ్లు అవుతోందని, ప్రస్తుతం అదే జట్టుకు తన కుమారుడు ఆడడం చాలా బాగుందని సచిన్ పేర్కొన్నాడు. అర్జున్ సోదరి సరా మైదానంలో అర్జున్ టెండుల్కర్ కు సపోర్టు చేస్తూ ఉత్సాహా పరిచింది.