LOADING...
IPL 2023: ముంబై, కోల్‌కతా కెప్టెన్‌లకు భారీ జరిమానా
దురుసుగా ప్రవర్తిస్తున్న నితీష్ రాణా

IPL 2023: ముంబై, కోల్‌కతా కెప్టెన్‌లకు భారీ జరిమానా

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2023
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాక్ ఇచ్చారు. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా అతనికి రూ.12 లక్షలు జరిమానా విధించారు. మరోవైపు ముంబై బౌలర్ హృతిక్ షోకీన్ వేసిన తొమ్మిది ఓవర్ తొలి బంతికి నితీష్ రాణా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ సమయంలో షోకిన్ రాణాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నితీష్ రాణా, షోకిన్ మైదానంలో గొడవకు గొడవకు దిగడంతో సూర్యకుమార్ యాదవ్, పీయూష్ చావ్లా వారిని వీడదీసే ప్రయత్నం చేశారు.

ముంబై ఇండియన్స్

బయటపడ్డ పాత గొడవలు

నితీష్ రాణా, షోకిన్ అనసరపు గొడవతో చెత్తగా ప్రవర్తించినందుకు బీసీసీఐ జరిమానా విధించింది. వీరిద్దరూ క్రమశిక్షణ ను ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు తేల్చిన నిర్వహకులు రాణా మ్యాచ్ ఫీజులో 25శాతం, షోకిన్ మ్యాచ్ ఫీజులో 10శాతం కోత విధించారు. నితీష్ రాణా, హృతిక్ షోకిన్ ఇద్దరు దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ఆడారు. నితీష్ రాణా ఢిల్లీ కెప్టెన్ కాగా.. హృతిక్ షోకిన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య గతంలో విభేదాలు ఉన్నట్లు సమాచారం. తాజా ఘటనలో ఢిల్లీ జట్టులో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.