IPL 2023: కోలకత్తా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది.
కోల్ కతా బ్యాటర్లలో వెంకటేష్ అయ్యర్ (104) సూపర్ సెంచరీతో చెలరేగాడు. చివర్లో రింకుసింగ్ 18, రస్సెల్ 21 పరుగులు చేశారు.
ముంబై బౌలర్లలో షోకిన్ 2, పీయూష్ చావ్లా, జాన్సెన్, గ్రీన్, మెరిడిత్ తలో ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ రెండు ఓవర్లు వేసి 17 పరుగులిచ్చాడు.
ముంబై
హాఫ్ సెంచరీ చేసిన ఇసాన్ కిసాన్
లక్ష్య చేధనకు బరిలోకి ముంబైకి శుభారంభం లభించలేదు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలో అడుగుపెట్టి 13 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
తర్వాత ఇసాన్ కిషాన్ బౌండరీల వర్షం కురిపించాడు. 25 బంతుల్లో 58 పరుగులతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ(30), టిమ్ డేవిడ్ 23 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.
కోల్ కతా బౌలర్లలో సుశేష్ శర్మ 2, వరుణ్ చక్రవర్తి, శార్దుల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు.
ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.