ఐపీఎల్ కు చెక్ పెట్టడానికి సౌదీ ఆరేబియా లీగ్ సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత ధనిక టీ20 లీగ్ ప్రారంభించేందుకు గల్ఫ్ దేశం సౌదీ ఆరేబియా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సౌదీ ప్రభుత్వం ఐపీఎల్ ప్రాంఛైజీలను సంప్రదించినట్లు సమాచారం.
అయితే బీసీసీఐ రూల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఇతర దేశాల టీ20 లీగ్‌లు ఆడేందుకు అనుమతి లేదు. దీంతో బీసీసీఐని ఒప్పించేందుకు సౌదీ ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సౌదీ ఆరేబియాను గొప్ప క్రికెట్ డెస్టినేషన్‌గా మారుస్తామని అక్కడి క్రికెట్ ఫేడరేషన్ చైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ ఇప్పటికే స్పష్టం చేశారు.
ఆర్థికంగా బలంగా ఉన్న సౌదీ.. క్రికెట్ లీగ్ లోకి అడుగుపెడితే ఐపీఎల్ కు చెక్ పడే అవకాశం లేకపోలేదు.
సౌదీ ఆరేబియా లీగ్
బీసీసీఐతో సౌదీ ఆరేబియా లీగ్ సంప్రదింపులు
ఐపీఎల్ విజయం తర్వాత గత కొన్నేళ్లుగా వెస్టిండీస్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాల్లో ఫ్రాంచేజీలు లీగ్ ప్రారంభమై సక్సస్ అయ్యాయి.
యూఏఎస్, దక్షిణాఫ్రికాలో కూడా టీ20 ఫ్రాంచేజీలకు లీగ్‌లకు అదిరిపోయే స్పందన లభించింది.
సౌదీ ఆరేబియా లీగ్ లో భారత్ క్రికెటర్లు భాగం చేయడానికి గల్ఫ్ దేశంలో ప్రణాళికలను రచిస్తోంది.
అయితే ఎవరైనా భారత ఆటగాడు ఈ లీగ్ లో భాగం కావాలనుకుంటే బీసీసీఐతో తన సంబంధాలన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది.
దీంతో ఆటగాళ్లు టీమిండియా, ఐపీఎల్, దేశవాళీ టోర్నిల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది