Page Loader
నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, సన్‌రైజర్స్ మధ్య బిగ్ ఫైట్

నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2023
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా 19వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లోనూ విజయఢంకా మోగించింది. మరోపక్క ఈ మ్యాచ్‌లోనే ఎలాగైనా కేకేఆర్‌ను ఓడించాలని ఎస్ఆర్‌హెచ్ గట్టి పట్టుదలతో ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకూ 22 మ్యాచ్ లో తలపడగా.. కోల్ కతా నైట్ రైడర్స్ 15 మ్యాచ్ లు, సన్ రైజర్స్ 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్ హెచ్ హ్యారీబ్రూక్‌ను పక్కనపెట్టి, న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ పిలిప్స్ జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది.

ఎస్ఆర్‌హెచ్

ఇరు జట్లలోని ఆటగాళ్లు

కేకేఆర్ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గుర్భాజ్ స్థానంలో జాసన్ రాయ్‌ని తుది జట్టులోకి తీసుకొనే అవకాశాలున్నాయి. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. కోల్ కతా నైట్ రైడర్స్ : జాసన్ రాయ్, నారాయణ్ జగదీశన్ (WK), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా ( కెప్టెన్), రింకూసింగ్, ఆండ్రీరస్సెల్, సునీల్ నరైన్, శార్థూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. సన్ రైజర్స్ హైదరాబాద్ : గ్లెన్‌ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, త్రిపాఠి, మార్క్రమ్ ( కెప్టెన్ ), హెన్రిచ్ క్లాసెస్ ( వికెట్ కీపర్ ), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.