LOADING...
చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో ముందు స్పల్ప స్కోరు
3 వికెట్లతో చెలరేగిన కృనాల్ పాండ్యా

చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో ముందు స్పల్ప స్కోరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
09:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

లక్నోలోని ఆటల్ బిహరి వాజ్ పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి ఎదురు దెబ్బ తగిలింది. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్(8) ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి దిగిన రాహుల్ త్రిపాఠితో కలిసి అన్మోల్‌ప్రీత్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అన్నోల్‌ప్రీత్ సింగ్(31) ఫర్వాలేదనిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారీ అంచనాలు పెట్టుకున్న మర్ర్కమ్(0) డకౌట్‌తో వెనుతిరిగడంతో 55 పరుగులకే సన్ రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కష్టాల్లో పడింది.

సన్ రైజర్స్

రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు

హ్యారిబ్రూక్(3), వాషింగ్టన్ సుందర్(16), అబ్దుల్ సమద్(8), అదిల్ రషీద్(4) పరుగులు చేసి వెనుతిరిగాడు. చివర్లో అబ్దుల్ సమద్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి చెలరేగాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, అమిత్ మిశ్రా 2, రవి బిసోని, దీపక్ హుడా తలా వికెట్ తీశారు. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.