Page Loader
లక్నో సూపర్ జెయింట్స్ VS హైదరాబాద్.. రైజర్స్ రాత మారేనా..?
లక్నోతో తలపడనున్నసన్ రైజర్స్

లక్నో సూపర్ జెయింట్స్ VS హైదరాబాద్.. రైజర్స్ రాత మారేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. తొలుత లక్నో జట్టు విషయానికొస్తే... మార్కస్ స్టొయినిస్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటాన్ డికాక్ తుది జట్టులో చోటు లభించనుంది. జయదేవ్ ఉనద్కత్‌ను ఫైనల్ ఎలెవన్‌లో ఆడించవచ్చు. పేసర్ యశ్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉండే అవకాశం ఉంది. ఇక సన్ రైజర్స్ జట్టులో రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తుది జట్టులో తప్పక బరిలోకి దిగనున్నాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన భువనేశ్వర్.. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

సన్ రైజర్స్

సన్ రైజర్స్, లక్నో జట్టులోని సభ్యులు

వికెట్ కీపర్ ఫిలిప్స్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండొచ్చు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, హ్యారీ బ్రూక్‌, రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, టి నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ, మయాంక్‌ మార్కండే (ఇంపాక్ట్‌ ప్లేయర్‌) లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌కీపర్‌), కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌, కృష్ణప్ప గౌతమ్‌, మార్క్‌ వుడ్‌, రవి బిష్ణోయ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఆవేశ్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)